పెళ్లి వేడుక‌కు క‌రోనా బాధితుడు.... 85 మంది క్వారంటైన్‌కు!

ABN , First Publish Date - 2020-06-16T16:57:26+05:30 IST

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛ‌త‌ర్‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఒక పెళ్లివేడుక‌కు హాజ‌రైన ఒక వ్య‌క్తి క‌రోనా పాజిటివ్ అని తెలిసింది. పెళ్లి రోజునే ఆ వ్య‌క్తి క‌రోనా రిపోర్టు వ‌చ్చింది. ఈ రిపోర్టును చూసిన‌వారంతా హ‌డ‌లెత్తిపోయారు.

పెళ్లి వేడుక‌కు క‌రోనా బాధితుడు.... 85 మంది క్వారంటైన్‌కు!

ఛ‌త‌ర్‌పూర్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛ‌త‌ర్‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఒక పెళ్లివేడుక‌కు హాజ‌రైన ఒక వ్య‌క్తి క‌రోనా పాజిటివ్ అని తెలిసింది. పెళ్లి రోజునే ఆ వ్య‌క్తి క‌రోనా రిపోర్టు వ‌చ్చింది. ఈ రిపోర్టును చూసిన‌వారంతా హ‌డ‌లెత్తిపోయారు. ఈ విష‌యం వైద్యాధికారుల‌కు తెలియ‌డంతో వారు పెళ్లి తంతు పూర్తికాగానే వారంద‌రినీ హోం క్వారంటైన్‌కు త‌ర‌లించారు. అయితే ఈ విష‌యం తెలిసిన వెంట‌నే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో క‌ల‌క‌లం చెల‌రేగింది. మీడియాకు అందిన వివ‌రాల ప్ర‌కారం క‌రోనా సోకిన వ్య‌క్తి వ‌ధువుకు బంధువు. మూడు రోజుల క్రితం అత‌ను గురుగ్రామ్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చాడు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆసుప‌త్రిలో త‌న శాంపిల్స్ ఇచ్చాడు. అయితే పెళ్లి జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అత‌ని క‌రోనా రిపోర్టు వచ్చింది. అత‌ను క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అక్క‌డున్న‌వారంతా హ‌డ‌లిపోయారు. అయితే ఛ‌త‌ర్‌పూర్ జిల్లా అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని పెళ్లివారందినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. 

Updated Date - 2020-06-16T16:57:26+05:30 IST