ప్రజలందరికీ ఉచితంగా : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ABN , First Publish Date - 2020-11-19T01:52:18+05:30 IST

కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పలు దేశాలు, వివిధ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫైజర్, మోడర్నా తదితర సంస్థలు తమ వ్యాక్సీన్ 90-94 శాతం ఫలితాలనిచ్చాయని చెబుతున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్... పరీక్షల కోసం భారత్ చేరుకుంది.

ప్రజలందరికీ ఉచితంగా : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

బెంగళూరు : కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పలు దేశాలు, వివిధ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫైజర్, మోడర్నా తదితర సంస్థలు తమ వ్యాక్సీన్ 90-94 శాతం ఫలితాలనిచ్చాయని చెబుతున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్... పరీక్షల కోసం భారత్ చేరుకుంది.


వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి ఓ కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చారు.  మాట్లాడుతూ... వ్యాక్సిన్ ప్రజల కోసం అవసరమని, దీనిని  భూమ్మీద ఉన్న ప్రజలందరికీ ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి లేదా ఇండివిడ్యువల్‌గా ఒక్కో దేశం ఈ వ్యాక్సిన్ ఖరీదును... దానిని తయారు చేసే కంపెనీలు లేదా దేశాలకు పరిహారంగా ఇవ్వాలని సూచించారు.


ఐక్యరాజ్యసమితి, ఆయా దేశాలు వ్యాక్సిన్ ఖర్చు కోసం  నిధులనివ్వాలి తప్ప వాటి లాభాల కోసం కాదని పేర్కొన్నారు. తద్వారా... ఇది లాభాలు చూసే సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యయాన్ని భరించేందుకు పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు ఈ ఖర్చులో ప్రధాన భాగాన్ని పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ను తాము ఉచితంగా పంపిణీ చేస్తామని బీహార్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను నారాయణమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 


Read more