వారంలో వస్తానంటూ గల్ఫ్ నుంచి ఫోన్.. కొద్ది గంటల్లోనే ఆ యువకుడి చావు కబురు..!

ABN , First Publish Date - 2020-10-27T17:13:56+05:30 IST

బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన యువకుడు బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లి బహ్రెయిన్‌లో ఉరివేసుకొని మృతి చెందాడు. దాచారం గ్రామానికి చెందిన

వారంలో వస్తానంటూ గల్ఫ్ నుంచి ఫోన్.. కొద్ది గంటల్లోనే ఆ యువకుడి చావు కబురు..!

బహ్రెయిన్‌లో  దాచారం యువకుడి ఆత్మహత్య


బెజ్జంకి (సిద్దిపేట): బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన యువకుడు బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లి బహ్రెయిన్‌లో ఉరివేసుకొని మృతి చెందాడు.  దాచారం గ్రామానికి చెందిన  సన్నపు మహేశ్‌  (23)జీవనోపాధి కోసం బహ్రెయిన్‌ దేశానికి రెండేళ్ల క్రితం  వెళ్లాడు. ఆదివారం దసరా పండుగ సందర్భంగా మహేష్‌ ఫోన్‌లో తమతో మాట్లాడి వారం రోజుల్లో స్వగ్రామానికి తిరిగివస్తున్నట్టు ఆనందంగా  చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మాట్లాడిన కొద్ది గంటల వ్యవధిలోనే  మహేష్‌  మృతి చెందాడని  సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జీవనోపాధి కోసం  గల్ఫ్‌ దేశానికి  వెళ్లిన మహేశ్‌ మృతదేహన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్‌ కుమార్‌ కోరారు.

Updated Date - 2020-10-27T17:13:56+05:30 IST