అమెరికాలో భార‌తీయ వైద్యురాలికి అరుదైన గౌర‌వం.. ఉపరాష్ట్రపతి హర్షం

ABN , First Publish Date - 2020-04-22T01:35:19+05:30 IST

అమెరికాలోని కనెక్టికట్‌లో ఉన్న సౌత్ విండ్సర్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు.. భారత సంతతికి (మైసూరు) చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా మధుసూధన్ చేస్తున్న అసాధారణ సేవలకు గుర్తింపుగా.. స్థానికులు, ప్రభుత్వాధికారులు 100 వాహనాలతో

అమెరికాలో భార‌తీయ వైద్యురాలికి అరుదైన గౌర‌వం.. ఉపరాష్ట్రపతి హర్షం

న్యూఢిల్లీ: అమెరికాలోని సౌత్ విం‌డ్స‌ర్ ఆస్ప‌త్రిలో ప‌నిచేసే భార‌త్‌లోని మైసూర్‌కు చెందిన ఉమా మ‌ధుసూద‌న అనే వైద్యురాలికి అరుదైన గౌర‌వం దక్కడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులందరికీ దక్కిన గౌరవంగా దీన్ని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వాధికారులు 100 వాహనాలతో గౌరవ వందనం చేయడం ముదావహమని పేర్కొన్నారు. ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రెండు వాక్యాల్లో తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు వెంకయ్య.


‘‘ఈ గౌరవ వందనం ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని గౌరవించుకుందాం. అమెరికాలోని కనెక్టికట్‌లో ఉన్న సౌత్ విండ్సర్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు.. భారత సంతతికి (మైసూరు) చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా మధుసూధన్ చేస్తున్న అసాధారణ సేవలకు గుర్తింపుగా.. స్థానికులు, ప్రభుత్వాధికారులు 100 వాహనాలతో గౌరవ వందనం చేయడం ముదావహం’’ అని ట్వీట్ చేశారు. దీనితో పాటు ఈ వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతి రాసిన వార్తా లింకును ట్వీట్‌లో జత చేశారు.

Updated Date - 2020-04-22T01:35:19+05:30 IST