సౌదీలో 50వేలు దాటిన‌ క‌రోనా కేసులు !

ABN , First Publish Date - 2020-05-17T14:59:29+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ స్వైర విహారం చేస్తోంది.

సౌదీలో 50వేలు దాటిన‌ క‌రోనా కేసులు !

రియాధ్‌: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ స్వైర విహారం చేస్తోంది. శ‌నివారం న‌మోదైన 2,840 కొత్త కేసుల‌తో క‌లిపి సౌదీలో క‌రోనా కేసుల సంఖ్య 50వేల మార్కును దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో కోవిడ్ బారిన ప‌డిన వారు  51,980 మంది అయ్యారు. అలాగే నిన్న 10 మర‌ణాలు సంభ‌వించాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో 302 మ‌ది ఈ వైర‌స్‌కు బ‌ల‌య్యారు. కాగా, మార్చి 2వ తేదీన సౌదీలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు కాగా, గ‌త వారం రోజులుగా ప్ర‌తిరోజు 1500 త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇదిలాఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి 3.13ల‌క్ష‌ల‌కు పైగా మందిని పొట్ట‌నుబెట్టుకుంది. 47.21 ల‌క్ష‌ల‌ మంది బాధితులు ఉన్నారు.  


Updated Date - 2020-05-17T14:59:29+05:30 IST