హెచ్‌-4 ఉంటే యూఎస్‌ వెళ్లొచ్చు: ఇమ్మిగ్రేషన్‌ అటార్నీ షీలామూర్తి

ABN , First Publish Date - 2020-06-25T13:08:44+05:30 IST

హెచ్‌-1బీ, తదితర వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన తాత్కాలిక నిషేధం అనేక మంది భారత ఐటీ నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. శ్వేత సౌధం విడుదల చేసిన ఆదేశాలను వివిధ ప్రభుత్వ సంస్థలు ఎలా అమలు చేస్తాయి? ఈ ఆదేశాల్లో ప్రతి పదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలపై స్పష్టత లేదు.

హెచ్‌-4 ఉంటే యూఎస్‌ వెళ్లొచ్చు: ఇమ్మిగ్రేషన్‌ అటార్నీ షీలామూర్తి

హెచ్‌-1బీ వీసా మంజూరై అమెరికాలో లేకుంటేనే సమస్య

హెచ్‌-1బీ, తదితర వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన తాత్కాలిక నిషేధం అనేక మంది భారత ఐటీ నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. శ్వేత సౌధం విడుదల చేసిన ఆదేశాలను వివిధ ప్రభుత్వ సంస్థలు ఎలా అమలు చేస్తాయి? ఈ ఆదేశాల్లో ప్రతి పదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో చాలా మందికి ఎదురయ్యే సమస్యలకు అమెరికాలోని ప్రముఖ ఇమ్మిగ్రేషన్‌ అటార్నీ షీలా మూర్తి పరిష్కారాలు సూచిస్తున్నారు. ఆంధ్రజ్యోతి పాఠకులకు వీటిని ప్రత్యేకంగా అందిస్తున్నాం. 


ఒక కంపెనీ తన సిబ్బందికి హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేయటానికి సిద్ధంగా ఉంది. తాజా ఆదేశాల వల్ల వారు ఈ వీసాకు దరఖాస్తు చేయలేరా?

కంపెనీ అమెరికాలో ఉండి జూన్‌ 24వ తేదీకి ముందు దరఖాస్తు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెచ్‌-1బీ వీసా మంజూరై అమెరికాలో లేకపోతేనే సమస్య వస్తుంది. తాజా ఆదేశాల ప్రకారం.. వివిధ దేశాల్లోని దౌత్య కార్యాలయాల నుంచి హెచ్‌-1బీ వీసాలు పొందటానికి వీలుండదు. ఒకవేళ హెచ్‌-1బీ వీసా పొందిన వారు కూడా అమెరికా అత్యవసర సేవల జాబితాలోని రంగంలో పనిచేయకపోతే వారు 2021 జనవరి దాకా ఆ దేశానికి వెళ్లలేరు. ఈ గడువును మరింత కాలం పొడిగించే అధికారం అధ్యక్షుడికి ఉంది.


కొందరు ట్రాన్స్‌ఫర్‌, మరి కొందరు మార్పుల కోసం దరఖాస్తు చేశారు. వీరి పరిస్థితి ఏంటి?

ప్రస్తుతమున్న హెచ్‌-1బీ హోదాకు ఎటువంటి సమస్య ఉండదు. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యవసరమైన సేవల రంగంలో పనిచేస్తున్నామని ఆధారాలు చూపించకపోతే వీసా ట్రాన్స్‌ఫర్‌కు గానీ మార్పుల కోసం గానీ దరఖాస్తు చేయటానికి వీలుండదు. అంటే ప్రస్తుత వీసాల్లో ఎటువంటి మార్పులు చేయరు. 


కొందరు అమెరికాలో హెచ్‌-1బీపై ఉన్నారు. వారి భార్య, పిల్లలు భారత్‌లో చిక్కుకుపోయారు. వారికి హెచ్‌-4 వీసాలున్నాయి. వారు తిరిగి వెళ్లవచ్చా?

హెచ్‌-4 వీసాలుంటే తిరిగి వెళ్లవచ్చు. అయితే వారు హెచ్‌-4కు దరఖాస్తు చేసుకుని ఉంటే వెళ్లటానికి వీలుం డదు. కొన్నిసార్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రెండు వేర్వేరు దేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి కలుసుకోవటానికి ఫ్యామిలీ యూనిటీ నిబంధన కింద అనుమతిస్తుంటారు. అలా దరఖాస్తు చేసుకోవటం ఒక మార్గం. ఇక బీ-2 వీసా కింద దరఖాస్తు చేసుకోవటం రెండో మార్గం.  


ప్రతిభ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ ప్రభావం ఈబీ-2, ఈబీ-3 వీసాలపై పడుతుందా?

ప్రతిభ ఆధారిత వ్యవస్థ (మెరిట్‌ బేస్డ్‌ సిస్టమ్‌) అనేది కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. దీన్ని కాం గ్రె్‌సలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టలేదు. అందువల్ల దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈలోపు బిల్లును ప్రవేశపెట్టడం,  కాంగ్రెస్‌ ఆమోదించడం జరిగే పని కాదు. అందువల్ల ఆందోళన అవసరం లేదు. 


ట్రంప్‌ ఆదేశాలను కోర్డులో సవాల్‌ చేస్తారా?

త్వరలోనే ఈ ఆదేశాలను కోర్డులో సవాలు చేస్తారు. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌లోని 212 (ఎఫ్‌) నిబంధన విదేశీయులను అమెరికాలోకి రానివ్వకుండా ఆదేశాలు జారీ చేసే అధికారాలను అధ్యక్షుడికి కట్టబెడుతోంది. అయితే పరిమితులను నిబంధన స్పష్టం చేయ టం లేదు. అందువల్ల ట్రంప్‌ తాజా ఆదేశాలను కొన్ని సంస్థలు కచ్చితంగా సవాల్‌ చేస్తాయి. -స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-25T13:08:44+05:30 IST