కరోనా కేంద్రంగా మారుతున్న బ్రెజిల్.. ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2020-05-13T20:53:28+05:30 IST

కరోనాను చాకచక్యంగా ఎదుర్కొంటున్నాయని అనుకుంటున్న దేశాలు

కరోనా కేంద్రంగా మారుతున్న బ్రెజిల్.. ఒక్కరోజులోనే..

బ్రసిలియా: కరోనాను చాకచక్యంగా ఎదుర్కొంటున్నాయని అనుకుంటున్న దేశాలు ఇప్పుడు కరోనాకు కేంద్రంగా మారడం ఆశ్యర్యం కలిగిస్తోంది. రష్యా తరువాత ఈ జాబితాలోకి తాజాగా బ్రెజిల్ చేరింది. బ్రెజిల్‌లో మంగళవారం ఒక్కరోజే కరోనా కారణంగా 881 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తంగా చనిపోయిన వారి సంఖ్య 12,400కు చేరింది. మరోపక్క గత రెండు వారాల నుంచి కరోనా పాజిటివ్ కేసులు కూడా రెట్టింపయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని కమ్యూనికేబుల్ డిసీజెస్ డిపార్ట్‌మెంట్ హెడ్ మార్కోస్ ఎస్పినాల్ అన్నారు. ఇదిలా ఉంటే.. దేశంలో లాక్‌డౌన్ విధించడంపై అధ్యక్షుడు జైర్ బొల్సొనారో అసహనం వ్యక్తం చేశారు. కరోనా సాధారణ ఫ్లూ అని.. ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతించాలని రాష్ట్రాలను కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1,78,214 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా జర్మనీని దాటేసిన బ్రెజిల్ ఈ వారంలో కరోనా కేసుల సంఖ్యలో ఫ్రాన్స్‌ను కూడా దాటే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ ఏడో స్థానంలో నిలిచింది. 

Updated Date - 2020-05-13T20:53:28+05:30 IST