అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 రోజుల ముందే తీవ్రస్థాయిలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-10-31T23:19:00+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 రోజుల ముందే తీవ్రస్థాయిలో కరోనా విజృంభణ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 రోజుల ముందే తీవ్రస్థాయిలో కరోనా విజృంభణ

వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో అమెరికాలో 100,000 పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.


ఒక్కరోజులో అమెరికాలో 100,233 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. సెప్టెంబరు నెలలో ఒకే రోజు భారతదేశంలో నమోదైన 97,894 కేసులను అమెరికా అధిగమించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందే భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవడంతో ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వల్ల ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 230,000 మంది మృతి చెందారు.


Read more