క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తుల అమ్మకం షురూ! 1000 విదేశీ ఉత్పత్తులు వెనక్కు

ABN , First Publish Date - 2020-06-01T19:57:55+05:30 IST

న్యూఢిల్లీ: నేటి నుంచి దేశంలోని అన్ని కేంద్ర బలగాల (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్) క్యాంటీన్లలో( కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భాండార్స్) స్వదేశీ

క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తుల అమ్మకం షురూ! 1000 విదేశీ ఉత్పత్తులు వెనక్కు

న్యూఢిల్లీ: నేటి నుంచి దేశంలోని అన్ని కేంద్ర బలగాల (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్) క్యాంటీన్లలో( కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భాండార్స్) స్వదేశీ ఉత్పత్తులనే అమ్ముతున్నారు. కేంద్రబలగాలకు చెందిన 10 లక్షల మంది సిబ్బంది ఇకపై స్వదేశీ ఉత్పత్తులనే కొంటారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్‌జీ, ఎస్ఎస్‌బీ బలగాలన్నీ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌ కిందకు వస్తాయి. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ క్యాంటీన్ల ద్వారా ఏటా 2800 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరుగుతాయి. సీఏపీఎఫ్‌కు చెందిన 10 లక్షల మంది సిబ్బంది కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటే కనీసం 50 లక్షల మంది ఈ ఉత్పత్తులను కొంటారు. 


 

కనీసం వెయ్యి విదేశీ ఉత్పత్తులను క్యాంటీన్ వస్తువుల జాబితా నుంచి తొలగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మైక్రో ఓవెన్స్, ఫుట్‌వేర్, షర్టులు తదితర ప్రొడక్ట్‌లను క్యాంటిన్‌లనుంచి తొలగించారు. అనేక విదేశీ కంపెనీల నుంచి ఉత్పత్తులు కొనడం ఆపేశారు. 


క్యాంటీన్‌లలో వస్తువులను మొత్తం మూడు క్యాటగిరీలుగా విభజించారు. 


తొలి క్యాటగిరీ- పూర్తిగా భారత్‌లో తయారైన వస్తువులు

రెండో క్యాటగిరీ- ముడి పదార్ధాలు విదేశాల నుంచి తెప్పించుకుని భారత్‌లో తయారు చేసినవి

మూడో క్యాటగిరి- పూర్తిగా విదేశాల నుంచి తెప్పించినవి


తొలి రెండు క్యాటగిరీలకు చెందిన వస్తువులను క్యాంటీన్లలో విక్రయిస్తున్నారు. మూడో క్యాటగిరీకి చెందిన వస్తువుల అమ్మకాలు పూర్తిగా నిలిపివేశారు. 


షా తరహాలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆర్మీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులనే అమ్మాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్మీ క్యాంటీన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న త్రివిధ దళాల సైనికులతో పాటు మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉత్పత్తులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.


ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వదేశీ ఉత్పత్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2020-06-01T19:57:55+05:30 IST