డీహెచ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీం స్టే

ABN , First Publish Date - 2020-12-17T08:04:27+05:30 IST

కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జి. శ్రీనివాసరావుకు హైకోర్టు జారీ చేసిన

డీహెచ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జి. శ్రీనివాసరావుకు హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కోర్టు ధిక్కరణ చర్యలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం ఆర్‌షాల ధర్మాసనం విచారణ జరిపింది.


పిటిషన్‌లోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రోజుకు 50 వేల కరోనా పరీక్షలు, వారానికి కనీసం లక్ష పరీక్షలు నిర్వహించాలని జారీ చేసిన ఆదేశాలను పాటించడం లేదని రాష్ట్ర హైకోర్టు ఇటీవల శ్రీనివాస రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  


Updated Date - 2020-12-17T08:04:27+05:30 IST