11 విధాలుగా రాయడంలో ఆమె దిట్ట

ABN , First Publish Date - 2020-09-16T22:10:49+05:30 IST

మంగుళూరుకు చెందిన ఆది స్వరూప అనే 16 ఏళ్ల బాలిక తన అద్భుత టాలెంట్‌తో..

11 విధాలుగా రాయడంలో ఆమె దిట్ట

బెంగళూరు: మంగుళూరుకు చెందిన ఆది స్వరూప అనే 16 ఏళ్ల బాలిక తన అద్భుత టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక నిముషంలో కుడి నుంచి ఎడమకు.. అలాగే ఎడమ నుంచి కుడికి రెండు చేతులతో ఎక్కువ పదాలు రాసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. నిముషానికి 16 పదాలు రాయగలగడం స్వరూప ప్రత్యేకత. అంతేకాదు 11 విధాలుగా రాసి అందరినీ అబ్బురపరుస్తోంది. 


అద్దంలో కనిపించే విధంగా తిరగబడి ఉన్న అక్షరాలు రాయడం, భిన్నమైన అంశాలను ఏక కాలంలో ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాయడం, భిన్నమైన భాషలను రెండు చేతులతో రాయడం, కళ్లకు గంతలు కట్టుకుని రాయడంలాంటి టాలెంట్‌లను ఆమె ప్రదర్శిస్తోంది. మిమిక్రీలో కూడా ఆమె సత్తా చాటుతోంది. వచ్చే ఏడాది పది అంశాల్లో ప్రపంచరికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆది స్వరూప చెబుతోంది.

Updated Date - 2020-09-16T22:10:49+05:30 IST