వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లరుకు కరోనా

ABN , First Publish Date - 2020-10-07T12:08:42+05:30 IST

అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లరుకు (35) కరోనా పాజిటివ్ అని తాజాగా తేలింది.

వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లరుకు కరోనా

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లరుకు (35) కరోనా పాజిటివ్ అని తాజాగా తేలింది. ట్రంప్‌తోపాటు హోప్ హిక్స్ తదితరులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్టీఫెన్ మిల్లరు గత ఐదు రోజులుగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మంగళవారం పరీక్ష చేయించుకోగా మిల్లరుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గత మే నెలలో మిల్లెర్ భార్య కేటీ మిల్లెర్ కు కరోనా సోకింది. ప్రస్థుతం గర్భవతిగా ఉన్న కేటీ మిల్లెర్ సాల్ట్ లేక్ సిటీలో సెనేటర్ కమలాహారిస్ బుధవారం ఉపాధ్యక్షుడు పెన్సు జరిపే చర్చ సన్నాహాల్లో కీలకపాత్ర పోహించారు. కేటీ మిల్లెర్ ఉపాధ్యక్షుడి ట్రావెలింగ్ పార్టీలో ఉన్నారు. 


ప్రస్థుతం కరోనా సోకిన స్టీఫెన్ మిల్లెర్ సెప్టెంబరు 30వతేదీన హైప్ హిక్స్‌తో కలిసి మెరైన్ వన్‌లో ప్రయాణించారు. గత వారం ట్రంప్ చర్చా సన్నాహక సమావేశంలో మిల్లెర్ పాల్గొన్నారు. ట్రంప్ తోపాటు వైట్ హౌస్ అధికారులకు కరోనా సోకుతుండటం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-10-07T12:08:42+05:30 IST