స్కాట్లండ్‌ యార్డ్‌ పోలీసు అధికారి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-07-19T07:40:59+05:30 IST

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతం గుర్తుందా? అటువంటి ఘటనే లండన్‌లోనూ చోటుచేసుకుంది. లండన్‌లోని ఇస్లింగ్‌టన్‌ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడి అరెస్టు సందర్భంగా అతడి మెడ, తలను మెట్రోపాలిటన్‌ పోలీసు అధికారి తన మోకాలితో తొక్కిపట్టాడు...

స్కాట్లండ్‌ యార్డ్‌ పోలీసు అధికారి సస్పెన్షన్‌

  • జార్జి ఫ్లాయిడ్‌ తరహా  ఘటనతో లండన్‌లో కలకలం

లండన్‌, జూలై 18: నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతం గుర్తుందా? అటువంటి ఘటనే లండన్‌లోనూ చోటుచేసుకుంది. లండన్‌లోని ఇస్లింగ్‌టన్‌ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడి అరెస్టు సందర్భంగా అతడి మెడ, తలను మెట్రోపాలిటన్‌ పోలీసు అధికారి తన మోకాలితో తొక్కిపట్టాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో కలకలానికి దారితీసింది. అతను ఎంత మొత్తుకుంటున్నా పోలీసులు కనికరించలేదు. పైగా చేతులకు బేడీలు వేసి ఉన్న వ్యక్తితో ఇలా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్కాట్లండ్‌ యార్డు పోలీసుల దుష్ప్రవర్తనపై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సర్‌ స్టీవ్‌ హౌస్‌ విచారం వ్యక్తం చేశారు. ‘ఆ వీడియో కలవరానికి గురిచేస్తోంది. ఈ ఘటనలో ఒక అధికారిని సస్పెండ్‌ చేశారు. మరొకరిని విధుల నుంచి తప్పించారు’ అని చెప్పారు. బహిరంగ ప్రదేశంలో ఆ వ్యక్తి కత్తితో సంచరిస్తున్నాడని, అందుకే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు.


Updated Date - 2020-07-19T07:40:59+05:30 IST