సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు.. టీచర్‌తో పాటు మరో ముగ్గురు అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-07T16:29:40+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో సోషల్‌మీడియాలో తప్పుడు, ఫేక్, విద్వేషం కలిగించే పోస్టులు చేయడం లేదా ఫార్వర్డ్ చేసిన కారణంగా వడోదరకు చెందిన ఓ

సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు.. టీచర్‌తో పాటు మరో ముగ్గురు అరెస్ట్

గాంధీనగర్: లాక్‌డౌన్ సమయంలో సోషల్‌మీడియాలో తప్పుడు, ఫేక్, విద్వేషం కలిగించే పోస్టులు చేయడం లేదా ఫార్వర్డ్ చేసిన కారణంగా వడోదరకు చెందిన ఓ టీచర్‌తో పాటు, గాంధీనగర్, అమ్రేలీ, అహ్మదాబాద్‌లకు చెందిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పాడ్రాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న నూర్ మహ్మద్ మలేక్(52) అనే ఉపాధ్యాయుడిని సోమవారం పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. మీడియాని వైరస్ అని అన్నందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్న వీడియోలను సోషల్‌మీడియాలో ఫార్వర్డ్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. మలేక్‌పై ఐపీసీ సెక్షన్ 153(ఏ), 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


అతనితోపాటు సెజ్కువా గ్రామానికి చెందిన ప్రారేసాబ్ నారుద్దీన్ రల్మియా సయిద్(47) అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మలేక్‌తో పాటు అతను ఓ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ గ్రూప్‌లో సయిద్ పంపిన వీడియోలను మలేక్ ఇతర గ్రూప్‌ల్లో షేర్ చేసేవాడు. ఇక ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు చేస్తున్న ఉమర్ ఖలీద్(40) అనే వ్యక్తిని అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై 294బీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.


నిజాముద్దీన్ ఘటనపై విద్వేషపూరితమైన వీడియోలు షేర్ చేసిన హసన్ జాఖ్రా(40)ను అమ్రేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీనగర్‌ కాలొల్ ఇంద్రలోక్ సొసైటీకి చెందిన ప్రియాంక్ పటేల్ అనే వ్యక్తి వాట్సాప్‌లో విద్వేషపూరితమైన స్పీచ్‌లు పోస్ట్ చేసిన కారణంగా అతన్ని అరెస్ట్ చేసి అతనిపై ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు నమోదు చేశారు. 

Read more