కరాచీ గగనతలంలో ఐఏఎఫ్‌ విమానాలట

ABN , First Publish Date - 2020-06-11T07:13:45+05:30 IST

భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానాలు కరాచీ గగనతలంలో మంగళవారం రాత్రి చక్కర్లు కొట్టాయన్న పుకార్లు పాకిస్థాన్‌లోని సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి...

కరాచీ గగనతలంలో ఐఏఎఫ్‌ విమానాలట

  • మరో బాలాకోట్‌ దాడులంటూ పుకార్లు

న్యూఢిల్లీ, జూన్‌ 10: భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానాలు కరాచీ గగనతలంలో మంగళవారం రాత్రి చక్కర్లు కొట్టాయన్న పుకార్లు పాకిస్థాన్‌లోని సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. దీంతో మరో బాలాకోట్‌ తరహా దాడులు జరగబోతున్నాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కరాచీని అధికారులు బ్లాక్‌ఔట్‌ (శత్రువు కంటబడకుండా లైట్లన్నీ ఆర్పేయడం) చేశారు. అయితే ఆ విమానాలన్నీ పాకిస్థాన్‌కు చెందినవేనని, ఐఏఎఫ్‌ విమానాలు రాజస్థాన్‌లోని సరిహద్దుల్లోనే ఉన్నాయని కొంతమంది వివరణ ఇచ్చారు. పాక్‌ యుద్ధ విమానాలను భారతీయ యుద్ధ విమానాలుగా పాకిస్థానీయులు ఏమైనా పొరబడ్డారా అన్న అంశంపైనా పాక్‌ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


Updated Date - 2020-06-11T07:13:45+05:30 IST