లాక్‌డౌన్‌ తరువాత ‘ప్రజా రవాణా’కు దూరం

ABN , First Publish Date - 2020-05-17T09:15:35+05:30 IST

లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

లాక్‌డౌన్‌ తరువాత ‘ప్రజా రవాణా’కు దూరం

దేశంలో 70 శాతం మంది ప్రజల అభిప్రాయమిదే

క్యాబ్‌ ప్రయాణానికి 62 శాతం మంది విముఖత


న్యూఢిల్లీ, మే 16: లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వివిధ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తుండటంతో త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ప్రారంభమయ్యాక కూడా బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తిగా లేరని వెలాసిటీ ఎంఆర్‌ అనే అధ్యయన సంస్థ తెలిపింది. దేశ వ్యాప్తంగా తమ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణానికి దూరంగా ఉంటామని చెప్పినట్లు పేర్కొంది. ఇక ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌లలో ప్రయాణం పట్ల కూడా 62 శాతం విముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. ఇక షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్లకు వెళ్లడాన్ని 71 శాతం మంది తగ్గించుకోనున్నారని, 80 శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ను కొనసాగిస్తామని చెప్పినట్లు వివరించింది. మరోవైపు కరోనా కారణంగా తలెత్తే నిరుద్యోగ సమస్యతో దేశంలో కనీసం 50 శాతం మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారని పేర్కొంది. 

Updated Date - 2020-05-17T09:15:35+05:30 IST