సొమ్మసిల్లిపోయిన ప్రగ్యా ఠాకూర్

ABN , First Publish Date - 2020-06-23T20:27:50+05:30 IST

భారతీయ జనతా పార్టీ భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మంగళవారంనాడు ఓ కార్యక్రమానికి హాజరైన..

సొమ్మసిల్లిపోయిన ప్రగ్యా ఠాకూర్

భోపాల్: భారతీయ జనతా పార్టీ భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మంగళవారంనాడు ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఆ సమయంలో ఆమె కొంత నలతగా కనిపించినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగ్యా ఠాకూర్ కొద్దికాలంగా ఒంట్లో నలతతో ఉన్నట్టు చెబుతున్నారు. ఈనెల 21న పార్టీ కార్యాలయంలో జరిగిన యోగా డేలో కూడా ఆమె పాల్గొన్నారు.

Read more