ఒమర్‌ అబ్దుల్లా విడుదల

ABN , First Publish Date - 2020-03-25T07:57:29+05:30 IST

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రజా భద్రతా చట్టం(పీఎ్‌సఏ) కింద గెస్ట్‌హౌ్‌సలో నిర్బంధించిన ఒమర్‌కు 8 నెలల తర్వాత...

ఒమర్‌ అబ్దుల్లా విడుదల

8 నెలల నిర్బంధం నుంచి విముక్తి


శ్రీనగర్‌, మార్చి 24: జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రజా భద్రతా చట్టం(పీఎ్‌సఏ) కింద గెస్ట్‌హౌ్‌సలో నిర్బంధించిన ఒమర్‌కు 8 నెలల తర్వాత విముక్తి లభించింది. గతేడాది ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి ఒమర్‌ను కేంద్ర ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. 6 నెలల తర్వాత ఫిబ్రవరి 5న పీఎ్‌సఏ కింద అదుపులోకి తీసుకొని సమీపంలోని గెస్ట్‌హౌ్‌సలో నిర్బంధించింది. కాగా.. రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్న ఇతరులనూ విడుదల చేయాలని, హైస్పీడ్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను పునరుద్ధరించాలని ఒమర్‌ అబ్దుల్లా కోరారు. 

Read more