ఒడిశాలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-18T22:19:35+05:30 IST

ఒడిశాలో పెరిగిన కరోనా కేసులు

ఒడిశాలో పెరిగిన కరోనా కేసులు

భువనేశ్వర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం సాయంత్రం నాటి అందిన సమాచారం మేరకు ఒడిశాలో కొత్తగా 591 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,701 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-07-18T22:19:35+05:30 IST