ప్రధాని మోదీతో భేటీ అయిన అజిత్ దోవల్

ABN , First Publish Date - 2020-09-12T13:38:19+05:30 IST

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో భేటీ అయిన అజిత్ దోవల్

న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎల్‌ఏసీ వెంట తలెత్తిన ఉద్రికత్త పరిస్థితులు, తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశాని కంటే ముందు రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కూడా దోవల్ హాజరయ్యారు. రాజ్‌నాథ్ సింగ్ తో జరిపిన చర్చలను కూడా దోవల్ మోదీతో పంచుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశ వివరాలు కూడా చర్చించనట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-09-12T13:38:19+05:30 IST