బిగ్‌ బ్రేకింగ్: ‘నిజాముద్దీన్ మర్కజ్‌’పై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-01T15:54:43+05:30 IST

పశ్చిమ నిజాముద్దీన్‌లోని తబ్లీగ్ జమాత్ కార్యక్రమాలలో హాజరయ్యేందుకు వచ్చిన విదేశీయులందరినీ

బిగ్‌ బ్రేకింగ్: ‘నిజాముద్దీన్ మర్కజ్‌’పై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: పశ్చిమ నిజాముద్దీన్‌లోని తబ్లీగ్ జమాత్ కార్యక్రమాలలో హాజరయ్యేందుకు వచ్చిన విదేశీయులందరినీ తక్షణం వారి స్వస్థలాలకు పంపాలని కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులను ఆదేశించింది.  కోవిడ్ 19 ప్రభావం ఉన్న వారికి అవసరమైన చికిత్స అందించాలని, నిర్బంధ కేంద్రాలకు పంపాలని పేర్కొంది. కోవిడ్ 19 ప్రభావం లేని వారిని వెంటనే పంపే ఏర్పాటు చేయాలని, ఒకవేళ విమానాలు దొరికే పరిస్థితి లేని పక్షంలో నిర్బంధ కేంద్రాల్లో ఉంచాలని తెలిపింది. వీరికి అయ్యే ఖర్చును వారిని తీసుకు వచ్చిన సంస్థ ద్వారా రాబట్టాలని సూచించింది. 

Updated Date - 2020-04-01T15:54:43+05:30 IST