కరోనా కట్టడిలో మోదీ సర్కారు భేష్‌

ABN , First Publish Date - 2020-04-01T08:29:56+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 సంక్షోభాన్ని ప్రధాని మోదీ సమర్థంగా ఎదుర్కొంటున్నారని ఐఏఎన్‌ఎ్‌స-సీ ఓటర్‌ సర్వేలో 83.5 ు మంది అభిప్రాయపడ్డారు. ‘‘భారత ప్రభుత్వం...

కరోనా కట్టడిలో మోదీ సర్కారు భేష్‌

ఐఏఎన్‌ఎ్‌స-సీ ఓటర్‌ సర్వేలో 83% మంది కితాబు

48.3% మందిలో వైరస్‌ భయం


న్యూఢిల్లీ, మార్చి 31: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 సంక్షోభాన్ని ప్రధాని మోదీ సమర్థంగా ఎదుర్కొంటున్నారని ఐఏఎన్‌ఎ్‌స-సీ ఓటర్‌ సర్వేలో 83.5 ు మంది అభిప్రాయపడ్డారు. ‘‘భారత ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటోందనే మాటను మీరు అంగీకరిస్తారా?’’ అనే ప్రశ్నకు ‘గట్టిగా అంగీకరిస్తున్నాను (స్ట్రాంగ్‌లీ అగ్రీ)’ అని 66.4% మంది, ‘అంగీకరిస్తున్నాను’ అని 17.1% మంది తెలిపారు. వారందరినీ కలిపితే 83.5ు మంది. 9.4ు మంది మాత్రం విభేదించారు. మార్చి 26-27 తేదీల్లో దేశవ్యాప్తంగా 1187 మందిని ప్రశ్నించి ఈ సర్వే నివేదికను వెలువరించారు.


తమకు వైరస్‌ సోకుతుంద 48.3% మంది ఆందోళన లో ఉన్నారు. కుటుంబసభ్యుల్లో ఒకరికి వైరస్‌ సోకుతుందని 22% మంది భయపడుతున్నారు. తమకు వైరస్‌ సోకదన్న ధీమాతో 46.5ు మంది ఉన్నారు.


కరోనా వైరస్‌ అంశాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారన్న భావనలో గత సర్వేతో(44.3%) పోలిస్తే ఈసారి(15.4%).. 25.7% మేర తగ్గడం గమనార్హం.


వచ్చే నెల నాటికి పరిస్థితి మెరుగవుతుందని 57.5% మంది భావించగా, మరింత దిగజారుతుందని 17.6% మంది అభిప్రాయపడ్డారు.


నిత్యావసరాల ధరలు పెరిగాయని 60.9% మంది చెప్పారు. 28.7% మంది అదేం లేదన్నారు.


లాక్‌డౌన్‌ విజయవంతమైందని 84.9% మంది అభిప్రాయపడగా.. 13.9% మంది విఫలమైందన్నారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి.. మానవాళికి ప్రకృతి పంపుతున్న సందేశమేనా అనే ప్రశ్నకు 46.7% మంది ఔనని సమాధానమివ్వగా.. 30.6% మంది కాదని చెప్పారు.


కరోనా నుంచి ప్రపంచం 6-12 నెలల్లో కోలుకుంటుందని 84% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 


రద్దీ లేని సమయాల్లో నిత్యావసర వస్తువులు కొనేందుకు వెళ్లడం లేదని 58% మంది చెప్పారు. 


తాము పనిచేసే సంస్థలు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఆప్షన్‌ ఇవ్వలేదని 25% మంది తెలిపారు. 


పత్రికలు, చానళ్ల ద్వారానే సమాచారం

కరోనాకు సంబంధించిన సమాచారం కోసం తాము వార్తాపత్రికలు, టీవీచానళ్ల వంటి సంప్రదాయ మీడియాపైనే ఆధారపడ్డామని 74.1% మంది తేల్చిచెప్పారు. కేవలం 18.5 శాతం మంది మాత్రమే కరోనా సమాచారం కోసం సోషల్‌ మీడియాను ఆశ్రయించారు. 5.2% మంది.. తమ ఇరుగుపొరుగువారి ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-04-01T08:29:56+05:30 IST