ఒక్క రోజులో 440 కరోనా కేసులు.. మహారాష్ట్రలో 8000 దాటిన కోవిడ్ బాధితులు

ABN , First Publish Date - 2020-04-27T03:17:40+05:30 IST

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో తీవ్ర రూపం దాలుస్తోంది. దేశం మొత్తంలో 23,917 కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే..

ఒక్క రోజులో 440 కరోనా కేసులు.. మహారాష్ట్రలో 8000 దాటిన కోవిడ్ బాధితులు

ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో తీవ్ర రూపం దాలుస్తోంది. దేశం మొత్తంలో 23,917 కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 8000కు పైగా కేసులున్నాయి. దేశంలోని కేసుల్లో దాదాపు 25శాతానికి పైగా కేసులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజే 400కు పైగా కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయంటే ఇక్కడ కరోనా ఏ విధంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందిస్తూ, రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 440 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 19 మంది మరణించారని తెలిపింది. వీటితో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో 8,068 కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయని, 342 మంది మరణించారని వివరించారు. కాగా 1,188 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వివరించారు.


ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల్లో 358 కేసులు రాష్ట్ర రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. కరోనా కారణంగా చనిపోయిన 19 మందిలో కూడా 12 మంది ముంబైలోనే మరణించారు. దీంతో ఒక్క ముంబైలోనే ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,407కు చేరింది. మొత్తంగా 204 మంది మృత్యువాత పడ్డారు. పూణెలో కొత్తగా 72 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,139కు చేరింది.

Updated Date - 2020-04-27T03:17:40+05:30 IST