కాఫీ డే వ్యవస్థాపకుడి కుమారుడికి కాంగ్రెస్ నేత కుమార్తెతో నిశ్చితార్థం

ABN , First Publish Date - 2020-06-16T11:39:36+05:30 IST

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, లేట్ వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యల నిశ్చితార్థం....

కాఫీ డే వ్యవస్థాపకుడి కుమారుడికి కాంగ్రెస్ నేత కుమార్తెతో నిశ్చితార్థం

బెంగళూరు (కర్ణాటక): కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, లేట్ వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యల నిశ్చితార్థం బెంగళూరులోని మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ నివాసగృహంలో నిరాడంబరంగా జరిగింది. రెండు కుటుంబాల నుంచి కేవలం కుటుంబసభ్యులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు వరుడు అమర్త్య హెగ్డే మనవడు. గత ఏడాది జులై నెలలో కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

Updated Date - 2020-06-16T11:39:36+05:30 IST