గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌... టాప్ 50 దేశాల గ్రూపులోకి ఇండియా

ABN , First Publish Date - 2020-09-04T00:07:47+05:30 IST

ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌’లో తొలిసారిగా టాప్ 50 దేశాల గ్రూపులోకి భారత్ ప్రవేశించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(విపో) , కార్నెల్ విశ్వవిద్యాలయం బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) జాబితా ప్రకారం,.. చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఇన్నోవేషన్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్, స్వీడన్, యూఎస్, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆధిక్యంలో ఉన్నాయి. టాప్ 10 స్థానాల్లో అధికాదాయ దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని విపో ఒక ప్రకటనలో వెల్లడించింది.

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌... టాప్ 50 దేశాల గ్రూపులోకి ఇండియా

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌’లో తొలిసారిగా టాప్ 50 దేశాల గ్రూపులోకి భారత్ ప్రవేశించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(విపో) , కార్నెల్ విశ్వవిద్యాలయం బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) జాబితా ప్రకారం,.. చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఇన్నోవేషన్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్, స్వీడన్, యూఎస్, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆధిక్యంలో ఉన్నాయి. టాప్ 10 స్థానాల్లో అధికాదాయ దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని విపో ఒక ప్రకటనలో వెల్లడించింది. 


ఐఐ ప్రకారం... భారతదేశం ప్రపంచంలో మూడవ అత్యంత వినూత్న దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారింది. కాగా... ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) సేవల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు, సైన్స్, ఇంజనీరింగ్‌‌లలో గ్రాడ్యుయేట్లు, ఆర్ అండ్ డి-ఇంటెన్సివ్ గ్లోబల్ కంపెనీలు వంటి సూచికలలో భారత్... మొదటి 15 స్థానాలను సొంతం చేసుకోవడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విశ్వవిద్యాలయాలు శాస్త్రీయ దృక్ఫధంలో ప్రచురణలకు అగ్రతాంబూలమిచ్చాయి. ఇక... అత్యధిక ఆవిష్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు ఎంతగనో దోహదపడ్డాయని జీఐఐ తెలిపింది.


ర్యాంకింగ్స్‌కు రాకముందు మొత్తం 131 దేశాలను జిఐఐ కింద విశ్లేషించారు. సంస్థల ఉత్పాదకత, మానవ మూలధనం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, మార్కెట్, వ్యాపార సాంకేతిక ఉత్పాదనలు, సృజనాత్మక ఉత్పాదనలను పరిగణనంలోకి తీసుకుని ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. 


Updated Date - 2020-09-04T00:07:47+05:30 IST