పాక్‌కు సమాచారం పంపిన మిలటరీ ఉద్యోగి అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-18T12:29:18+05:30 IST

భారతదేశానికి సంబంధించిన సైనిక సమాచారాన్ని పాకిస్థాన్ మిలటరీ ఇంటలిజెన్సుకు పంపించిన మిలటరీ ఉద్యోగిని హర్యానా స్పెషల్ టాస్కు‌ఫోర్సు అరెస్టు చేసిన ఘటన...

పాక్‌కు సమాచారం పంపిన మిలటరీ ఉద్యోగి అరెస్ట్

చండీఘడ్ (హర్యానా): భారతదేశానికి సంబంధించిన సైనిక సమాచారాన్ని పాకిస్థాన్ మిలటరీ ఇంటలిజెన్సుకు పంపించిన మిలటరీ ఉద్యోగిని హర్యానా స్పెషల్ టాస్కు‌ఫోర్సు అరెస్టు చేసిన ఘటన గురుగ్రామ్ నగరంలోని దారుహెరా  బస్‌స్టాండులో వెలుగుచూసింది. హర్యానా రాష్ట్రంలోని రేవారి జిల్లాకు చెందిన యువకుడు జైపూర్ నగరంలోని మిలటరీ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. 


మిలటరీ ఉద్యోగి వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ మిలటరీకి పంపించాడన్న సమాచారం మేర నిందితుడు గురుగ్రామ్ నగరంలోని దారుహెరా  బస్‌స్టాండులో ఉండగా హర్యానా స్పెషల్ టాస్కు‌ఫోర్సు గురువారం రాత్రి అరెస్టు చేసింది. నిందితుడిపై దారుహేరా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడి నుంచి ఎస్టీఎఫ్ పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-09-18T12:29:18+05:30 IST