బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన 14 మంది రోహింగ్యాల అరెస్ట్

ABN , First Publish Date - 2020-11-27T12:12:11+05:30 IST

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన 14 మంది రోహింగ్యాలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.....

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన 14 మంది రోహింగ్యాల అరెస్ట్

గువాహటి (అసోం): బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన 14 మంది రోహింగ్యాలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించి  అగర్తలా-న్యూఢిల్లీ స్పెషల్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న 14 మంది రోహింగ్యాలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ఎక్స్ ప్రెస్ లో విదేశీయులైన రోహింగ్యాలు ప్రయాణిస్తున్నారని అలిపుర్దౌర్ సెక్యూరిటీ కంట్రోలుకు సమాచారం వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు న్యూజల్పాయ్ గురి రైల్వేస్టేషనులో 14 మంది విదేశీ రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు. 


14 మంది రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి తప్పుడు పేర్లతో రైలులో ప్రయాణిస్తున్నారని రైల్వే పోలీసులు దర్యాప్తులో తేలింది. బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ శరణార్థుల శిబిరం నుంచి పారిపోయి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 14 మంది రోహింగ్యాలపై ఫారిన్ అమెండ్ మెంట్ యాక్టు కింద అరెస్టు చేసి వారిని మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా వారిని జుడీషియల్ కస్టడీకి పంపించారు.

Read more