అక్రమ ఆయుధ వ్యాపారంపై ఢిల్లీ పోలీసుల ఉక్కుపాదం.. 2400 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-14T00:32:04+05:30 IST

అక్రమ ఆయుధ వ్యాపారంపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఆరు నెలల్లో పలు ముఠాలపై దాడులు నిర్వహించిన

అక్రమ ఆయుధ వ్యాపారంపై ఢిల్లీ పోలీసుల ఉక్కుపాదం.. 2400 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: అక్రమ ఆయుధ వ్యాపారంపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఆరు నెలల్లో పలు ముఠాలపై దాడులు నిర్వహించిన పోలీసులు వందలాదిమందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో పాతుకుపోవాలని ప్రయత్నిస్తున్న క్రిమినల్ సిండికేట్ల భరతం పట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి నవంబరు 30 మధ్య 2,040 కేసుల్లో 2,431 మంది నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. వీరందరిపైనా వివిధ కేసులు నమోదై ఉన్నాయి. అరెస్ట్ చేసిన వారి నుంచి 1,702 అక్రమ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 1,493 దేశీయ పిస్టల్స్, 195 రివాల్వర్లు, 14 తుపాకులు ఉన్నాయి. అలాగే, 3,198 లైవ్ కాట్రిడ్జ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.   


Updated Date - 2020-12-14T00:32:04+05:30 IST