పంజాబ్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌

ABN , First Publish Date - 2020-07-27T07:22:44+05:30 IST

పంజాబ్‌లోని జలంధర్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న సౌరవ్‌ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

పంజాబ్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌

  • ఒకరి అరెస్టు, రూ.1.23 కోట్లు సీజ్‌

జలంధర్‌, జూలై 26: పంజాబ్‌లోని జలంధర్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న సౌరవ్‌ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.23 కోట్ల నగదు, ఓ ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌ అని, సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడని పోలీసులు తెలిపారు. వర్మ తన ఇంట్లో నుంచి ఇంగ్లండ్‌-వెస్ట్‌ ఇండీస్‌ టెస్టు మ్యాచ్‌పై బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరింత మందిని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-27T07:22:44+05:30 IST