వధూవరులిద్దరూ పాజిటివ్ అని తేలడంతో...

ABN , First Publish Date - 2020-04-26T17:09:18+05:30 IST

యూపీలోని అజంగఢ్ కు చెందిన ఒక కొత్త జంట తమ వివాహం తరువాత రాజస్థాన్‌ వెళ్ళింది. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో...

వధూవరులిద్దరూ పాజిటివ్ అని తేలడంతో...

అజంగఢ్ : యూపీలోని అజంగఢ్ కు చెందిన ఒక కొత్త జంట తమ వివాహం తరువాత రాజస్థాన్‌ వెళ్ళింది. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఇద్దరూ కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వారికి రాజస్థాన్‌లో చికిత్స జరుగుతోంది. అయితే  ఈ వివాహం జరిగిన అజంగఢ్ ‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరివివాహం ఛతర్‌పూర్ లో జరిగింది. పోలీసులు  గ్రామానికి సీలు వేసి, ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తున్నారు. అజంగఢ్  ఎస్పీ పంకజ్ పాండే మాట్లాడుతూ ఏప్రిల్ 14 న గ్రామానికి చెందిన వధూవరులు మొదట ఘాజిపూర్‌కు వెళ్లారని, అక్కడి నుంచి కారులో  రాజస్థాన్‌కు వెళ్లారని చెప్పారు. అక్కడ వైద్య పరీక్షలో ఇద్దరూ కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీనితో అధికార యంత్రాంగం ఆ గ్రామంలోని ప్రజలను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచింది. 

Updated Date - 2020-04-26T17:09:18+05:30 IST