కేరళలో ‘కరోనా’ పెళ్లి!

ABN , First Publish Date - 2020-07-27T07:59:50+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ వివాహం ఏకంగా 43 మందిని కరోనా పాల్జేసింది.

కేరళలో ‘కరోనా’ పెళ్లి!

కాసర్‌గోడ్‌ (కేరళ), జూలై 26: నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ వివాహం ఏకంగా 43 మందిని కరోనా పాల్జేసింది. బాధితుల్లో వధూవరులు కూడా ఉండడం విశేషం. ఈ ఘటన కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లా పిలాన్‌కట్టలో జరిగింది. జిల్లా ఆరోగ్య అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న వధువు ఇంట్లో జరిగిన ఈ వేడుకకు 120 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. నాలుగు రోజులకు వారిలో కొందరికి లక్షణాలు కనిపించాయి. వారందరికీ అధికారులు పరీక్షలు చేయించగా 43 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ పెళ్లితో సంబంధమున్న వారందరినీ  14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అఽధికారులు ఆదేశించారు. 

Updated Date - 2020-07-27T07:59:50+05:30 IST