కేంద్ర హోం శాఖ ఇచ్చిన సడలింపులు ఢిల్లీలోనూ అమలు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-04-26T17:52:17+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ ఇచ్చిన సడలింపులు ఢిల్లీలోనూ అమలు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

కేంద్ర హోం శాఖ ఇచ్చిన సడలింపులు ఢిల్లీలోనూ అమలు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ ఇచ్చిన సడలింపులు ఢిల్లీలోనూ అమలు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీని ప్రకారం నిత్యావసరాల కోసం  దుకాణాలు తెరిచి ఉంచుతామన్నారు. మెడికల్, కిరాణా లాంటి దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. షాపింగ్ బజార్లు, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ మాత్రం మూసే ఉంటాయని చెప్పారు.


ఏడవ వారంలో 850 కరోనా కేసులు నమోదు కాగా గత వారం 622 కేసులు మాత్రమే నమోదయ్యాయని కేజ్రీవాల్ తెలిపారు. 7వ వారంలో 207 మంది కోలుకున్నారని చెప్పిన సీఎం ఢిల్లీలో ఫ్లాస్మా థెరపీ మంచి ఫలితాలిస్తోందని తెలిపారు. కోలుకున్న రోగులు ప్లాస్మా డొనేట్ చేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. చికిత్స పొందుతున్న ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితిని తాను స్వయంగా పరిశీలిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు. 

Updated Date - 2020-04-26T17:52:17+05:30 IST