స్వతంత్రులతో టచ్‌లోకి వెళ్లిన సీఎం గెహ్లాట్

ABN , First Publish Date - 2020-06-12T01:17:59+05:30 IST

బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వతంత్ర ఎమ్మెల్యేలతో గురువారం టచ్‌లోకి వెళ్లినట్లు

స్వతంత్రులతో టచ్‌లోకి వెళ్లిన సీఎం గెహ్లాట్

రాజస్థాన్ : బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వతంత్ర ఎమ్మెల్యేలతో గురువారం టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల వేళ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూనే... వారి విషయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న దానిపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది.  అయితే వీరు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాకి ఇప్పటికే టచ్‌లోకి వెళ్లిపోయారు.


ఈ సమయంలో గెహ్లాట్ వీరిని కాంగ్రెస్ వైపు తిప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ స్పందించారు. ‘‘మా పార్టీ ఎమ్మెల్యేలు, మాకు మద్దతిచ్చే వారు, స్వతంత్రులు అందరమూ ఐకమత్యంతో ఉన్నాం. మెజారిటీ కంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాం. మా అభ్యర్థులు నీరజ్ డాంగీ, కేసీ వేణుగోపాల్ కచ్చితంగా గెలవబోతున్నారు’’ అని పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-12T01:17:59+05:30 IST