యుద్ధానికి సిద్ధంగా ఉండండి : బలగాలతో జింగ్‌పింగ్

ABN , First Publish Date - 2020-10-15T00:50:48+05:30 IST

సయోధ్యకు సిద్ధమంటూ చిలక పలుకులు పలుకుతున్న డ్రాగన్... సైనికులకు మాత్రం

యుద్ధానికి సిద్ధంగా ఉండండి : బలగాలతో జింగ్‌పింగ్

బీజింగ్ : సయోధ్యకు సిద్ధమంటూ చిలక పలుకులు పలుకుతున్న డ్రాగన్... సైనికులకు మాత్రం మరో రకంగా నూరిపోస్తోంది. ‘యుద్ధానికి సిద్ధంగా ఉండండి... దేశానికి విధేయంగా పనిచేయండి’’ అంటూ ‘‘యుద్ధ’’ వ్యాఖ్యలు నూరిపోస్తున్నారు చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్.  మంగళవారం అధ్యక్షుడు జింగ్‌పింగ్ గ్వాంగ్డాంగ్ మిలటరీ బేస్ క్యాంప్‌ను సందర్శించారు.


‘‘మీ శక్తి సామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించండి. మీ మనస్సును కూడా యుద్ధం వైపే నడిపించండి. పూర్తి నమ్మకంగా, పూర్తి స్వచ్ఛంగా, కచ్చితంగా... ఎప్పుడూ హై అలర్ట్‌తో ఉండండి.’’ అంటూ జింగ్‌పింగ్ సైన్యానికి ఉద్బోధించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.


అయితే ఈ వ్యాఖ్యలు మన దేశాన్ని ఉద్దేశించి అన్నారా? లేక అమెరికాను ఉద్దేశించి అన్నారో స్పష్టంగా తెలియరాలేదు కానీ... భారత్‌ వర్సెస్ చైనాగా వాతావరణం మారింది కాబట్టి... కచ్చితంగా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే జింగ్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని నిపుణులు పేర్కొంటున్నారు.  

Updated Date - 2020-10-15T00:50:48+05:30 IST