కన్నెర చేసిన మీడియా.. దేశాధ్యక్షుడిపై కేసు వేస్తాం అంటూ..

ABN , First Publish Date - 2020-07-09T04:27:47+05:30 IST

కరోనాతో పరాచకాలు ఆడినందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జేయిర్ బోల్సోనారో పాపం భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. కరోనా బారిన పడ్డారన్న చేదు వాస్తవం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయనపై కేసు వేస్తామంటూ అక్కడి మీడియా ప్రతినిధులు కోపంతో ఊగిపోతున్నారు.

కన్నెర చేసిన మీడియా.. దేశాధ్యక్షుడిపై కేసు వేస్తాం అంటూ..

బ్రెజీలియా: నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తూ కరోనాతో పరాచకాలు ఆడినందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జేయిర్ బోల్సోనారో ప్రస్తుతం నానా అగచాట్లూ పడుతున్నారు. ఆయన కరోనా బారిన పడ్డారన్న చేదు వాస్తవం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే దేశాధ్యక్షుడి పైన కేసు వేస్తామంటూ అక్కడి మీడియా ప్రతినిధులు కోపంతో ఊగిపోతున్నారు. తనకు కరోనా సోకిందన్న విషయం చెప్పేందుకు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాస్కు పెట్టుకోకుండానే ఆయన హాజరైనందుకు మీడియా వారు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. ‘అధ్యక్షుడు నిరంతరంగా నేరపూరిత వైఖరి కనబరుస్తూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు’ అని బ్రెజిల్ ప్రెస్ అసోసియేషన్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా విషయంలో ఇంతటి నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శించినందుకు జెయిర్‌పై కేసు వేస్తామని ఆ అసోసియేషన్ ప్రకటించింది. 

Updated Date - 2020-07-09T04:27:47+05:30 IST