బెంగళూరువాసులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 11 నుంచి..

ABN , First Publish Date - 2020-09-03T17:26:43+05:30 IST

అన్‌లాక్ 4లో భాగంగా మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. దేశంలోని ప్రధాన నగరాల్లో...

బెంగళూరువాసులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 11 నుంచి..

బెంగళూరు: అన్‌లాక్ 4లో భాగంగా మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఢిల్లీలో మెట్రో రైళ్లు సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు నగరంలో కూడా మెట్రో పట్టాలెక్కనున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎమ్‌ఆర్‌సీఎల్) ప్రకటించింది. అయితే.. సెప్టెంబర్ 11 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న మెట్రో రైళ్లను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నడపనున్నట్లు బీఎమ్‌ఆర్‌సీఎల్ తెలిపింది.


రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రతీ 5 నిమిషాలకు ఒక ట్రైన్‌ను, రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో 10 నిమిషాలకు ఒక ట్రైన్‌లో నడపనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు నగరంలో మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా స్మార్ట్ కార్డులను వినియోగించాలని, కౌంటర్‌లో టోకెన్ల అమ్మకాలు ఉండవని స్పష్టం చేసింది. మెట్రో రైలులో ఒకసారికి 400 మంది ప్రయాణికులు మాత్రమే అనుమతి ఉంటుందని, రైలులో అప్పటికే 400 మంది ప్రయాణికులు ఉంటే.. తర్వాతి మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదని బీఎమ్‌ఆర్‌సీఎల్ ప్రకటించింది.

Updated Date - 2020-09-03T17:26:43+05:30 IST