బెయిల్‌పై వచ్చాడు.. అంతలోనే...

ABN , First Publish Date - 2020-10-07T14:56:44+05:30 IST

హత్యకేసులో అరెస్టయిన బెయిలుపై విడుదల వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక కొసపేట కాల్వ సమీపంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి శవమై పడి ఉన్నట్లు వేలూరు పోలీసులకు

బెయిల్‌పై వచ్చాడు.. అంతలోనే...

చెన్నై : హత్యకేసులో అరెస్టయిన బెయిలుపై విడుదల వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక కొసపేట కాల్వ సమీపంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి శవమై పడి ఉన్నట్లు వేలూరు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారించగా.. అతను కొనవట్టమ్‌కు చెందిన సాల్మన్‌ (40) అని, దారి దోపిడీలు చేస్తుంటాడని, అతనిపై హత్య కేసు కూడా ఉందని తేలింది. ఈ కేసులో అరెస్టయిన సాల్మన్‌ కొద్ది రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యాడు. ఈ క్రమంలో, గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హతమార్చి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే, వివాహేతర సంబంధం కూడా హత్యకు దారితీసిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more