మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. నేడు కొత్తగా ఎన్ని కేసులంటే?

ABN , First Publish Date - 2020-04-28T23:31:03+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నేటి సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 522 కొత్త నిర్ధారిత

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. నేడు కొత్తగా ఎన్ని కేసులంటే?

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నేటి సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 522 కొత్త నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 8,590కి పెరిగింది. వీరిలో 1,282 మంది కోలుకోగా 369 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 3,096 ఒక్క ముంబైలోనే నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో పూణె (660), థానే (465), నాసిక్ (96), నాగ్‌పూర్ (76) ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల జాబితాలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

Updated Date - 2020-04-28T23:31:03+05:30 IST