24 గంటల్లో 177 కొత్త కేసులు: యూపీలో 1793కు చేరిన కరోనా బాధితులు

ABN , First Publish Date - 2020-04-26T11:20:56+05:30 IST

కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి లాక్డౌన్ విధించి నెల్లాళ్ళు దాటినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో యూపీలో...

24 గంటల్లో 177 కొత్త కేసులు: యూపీలో 1793కు చేరిన కరోనా బాధితులు

లక్నో: కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి లాక్డౌన్ విధించి నెల్లాళ్ళు దాటినప్పటికీ  కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో యూపీలో తాజాగా 177 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం కరోనా సోకిన రోగుల సంఖ్య 1793 కు చేరింది. 261 మంది కరోనా రోగులు చికిత్స తర్వాత కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 1793 కరోనా కేసులలో 1040 కేసులు తబ్లిగి జమాత్ కు సంబంధించినవి. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 27 మంది మరణించారు. ఆగ్రాలో ఇప్పటివరకు 371 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-04-26T11:20:56+05:30 IST