మాస్క్‌ మేకప్‌

ABN , First Publish Date - 2020-05-21T17:18:40+05:30 IST

ముఖానికి మాస్క్‌ తప్పనిసరి కావడంతో లిప్‌స్టిక్‌ల కొనుగోళ్లు తగ్గి, ఐ మేకప్‌ సౌందర్యసాధనాల కొనుగోళ్లు పెరిగాయి. మాస్క్‌తో మేకప్‌ను మ్యాచ్‌ చేసే చిట్కాలతో పాటు, కళ్ల సౌందర్యాన్ని పెంచే మెలకువలు అనుసరించమని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే...

మాస్క్‌ మేకప్‌

ఆంధ్రజ్యోతి(21-05-2020):

ముఖానికి  మాస్క్‌ తప్పనిసరి కావడంతో లిప్‌స్టిక్‌ల కొనుగోళ్లు తగ్గి, ఐ మేకప్‌ సౌందర్యసాధనాల కొనుగోళ్లు పెరిగాయి. మాస్క్‌తో మేకప్‌ను మ్యాచ్‌ చేసే చిట్కాలతో పాటు, కళ్ల సౌందర్యాన్ని పెంచే మెలకువలు అనుసరించమని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే...


మేకప్‌ పలుచగా...

ముఖంలో ఎక్కువ భాగాన్ని మాస్క్‌ దాచేస్తుంది కాబట్టి చర్మానికి అప్లై చేసే మేకప్‌ లేయర్స్‌ను తగ్గించాలి. ఇందుకోసం ‘స్పాట్‌ కన్‌సీలింగ్‌’ టెక్నిక్‌ అనుసరించాలి. ఫౌండేషన్‌ వేయాలనుకుంటే పల్చని లేయర్‌ పూసుకుని, స్పాంజ్‌తో చర్మంలో కలిసేలా పరుచుకోవాలి. మేకప్‌ చెదిరిపోకుండా బ్యూటీ స్పాంజ్‌తో పౌడర్‌ను చర్మానికి దగ్గరగా అద్దుకోవాలి. 


మాస్క్‌ ధరించడం మూలంగా కళ్ల మీదకే అందరి దృష్టి వెళుతుంది. కాబట్టి కనురెప్పల మీద ముదురు రంగు ఐ షాడో అప్లై చేస్తూ ఉండాలి. కనుబొమలను తీర్చిదిద్దినట్టుగా మలుచుకోవాలి. ఎక్కువ సమయం మాస్క్‌ ధరిస్తే చెమట పట్టక తప్పదు. దాంతో సున్నిత చర్మం కలిగినవారికి చర్మ సమస్యలు తప్పవు. ఇలా జరగకుండా మాస్క్‌ ధరించే ముందు పాలు లేదా ఆయిల్‌ బేస్డ్‌ క్లెన్సర్‌ వాడాలి. ఆ తర్వాత ఆలొవేరా టోనర్‌, మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. జిడ్డు చర్మం కలిగినవారు ఆయిల్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్లు మానేయాలి.


గత ఏడాదితో పోలిస్తే ఇటలీలో, మార్చి మొదటి వారంలో సౌందర్యసాధనాల కొనుగోళ్లు 17.3శాతం తగ్గాయి.

అమెరికాలో ఫిబ్రవరి చివరి వారంలో చర్మ సౌందర్యసాధానాల కొనుగోళ్లు 13శాతం పెరిగాయి.

మన దేశంలో సౌందర్య ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల కోసం సోషల్‌ మీడియాలో వెతికే వారి శాతం 54కు చేరుకుంది.

Read more