పెదవుల ఆరోగ్యం కోసం...

ABN , First Publish Date - 2020-10-25T20:46:45+05:30 IST

ముఖం తాజాగా ఉండేందుకు సీరమ్‌ క్రీమ్‌ రాసుకుంటాం. కానీ పెదవులకు లిప్‌బామ్‌ మాత్రమే వాడుతుంటాం. అయుతే పెదవులు పగలకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా లిప్‌ సీరమ్‌ పనికొస్తుంది. దీన్ని ఇంటివద్దనే తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే...

పెదవుల ఆరోగ్యం కోసం...

ఆంధ్రజ్యోతి(25-10-2020)

ముఖం తాజాగా ఉండేందుకు సీరమ్‌ క్రీమ్‌ రాసుకుంటాం. కానీ పెదవులకు లిప్‌బామ్‌ మాత్రమే వాడుతుంటాం. అయుతే పెదవులు పగలకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా లిప్‌ సీరమ్‌ పనికొస్తుంది. దీన్ని ఇంటివద్దనే తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే...

టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, సగం టీ స్పూన్‌ పసుపు తీసుకొని బాగా కలిపి లిప్‌ సీరమ్‌ తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సులువుగా ఉపయోగించడం కోసం రోల్‌ ఆన్‌ నాజిల్‌ మూత ఉన్న చిన్న సీసాలోకి మార్చాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు లేదా ఉదయాన్నే ముఖం కడుక్కున్న తరువాత ఈ లిప్‌ సీరమ్‌ను పెదవులకు రాసుకోవాలి. 

లిప్‌ సీరమ్‌ చర్మం లోపలికి వెళ్లి పెదవుల మీది పగుళ్లు, గీతలను తొలగించి మృదువుగా మారుస్తుంది. పెదవులకు చక్కని రూపాన్ని ఇస్తుంది. ఇది లిప్‌బామ్‌ కన్నా మెరుగైనది. అలానే స్క్రబ్బింగ్‌ తరువాత కొద్దిగా లిప్‌ సీరమ్‌ రాసుకుంటే పెదవులకు తేమ లభిస్తుంది. పసుపు పెదవులు రంగు మారడాన్ని అడ్డుకుంటుంది. శీతాకాలంలో పెదవులకు అవసరమైన పోషణను నెయ్యి అందిస్తుంది.

Read more