మెరిసే చర్మం కోసం...

ABN , First Publish Date - 2020-09-03T17:45:07+05:30 IST

ఈ సీజన్‌లో జిడ్డుగా మారి, నిర్జీవంగా కనిపించే చర్మాన్ని వంటింట్లో లభించే పదార్థాలతో కాంతిమంతంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే...

మెరిసే చర్మం కోసం...

ఆంధ్రజ్యోతి(03-09-2020)

ఈ సీజన్‌లో జిడ్డుగా మారి, నిర్జీవంగా కనిపించే చర్మాన్ని వంటింట్లో లభించే పదార్థాలతో కాంతిమంతంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే...


బంగాళదుంపలు: ఒక గిన్నెలో టీ స్పూన్‌ యోగర్ట్‌, చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మగడ్డి నూనె లేదా సాండల్‌వుడ్‌ నూనె తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచుతూ, వాటితో ముఖం అంతటా  రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత నీళ్లతో కడుక్కోవాలి. దీంతో నల్లమచ్చలు తగ్గి, చర్మం మెరుస్తుంది.


బియ్యప్పిండి:దుకు బియ్యప్పిండిని స్క్రబ్బర్‌గా ఉపయో.గించవచ్చు. టీ స్పూన్‌ చొప్పున అలోవెరా జెల్‌, బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు, రెండు చుక్కల లావెండర్‌ నూనె తీసుకొని ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. ఇప్పుడీ ప్యాక్‌ను ముఖానికి మర్దనా చేసినట్టు రాసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకొని తేలికైన మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

Read more