సూర్యకాంతితో పోటీపడేలా...

ABN , First Publish Date - 2020-12-11T15:46:43+05:30 IST

చర్మసౌందర్యంలో పాల పాత్ర ఎంతో ఉంది.. మృతకణాలను తొలిగించడంలో పచ్చి పాలు చక్కగా పనిచేస్తాయి. ముఖాన్ని ఓసారి కడుక్కుని పచ్చి పాలని దూదితో పూయండి. అలాగే ఆరనిచ్చి కడిగేస్తే సరి. చర్మంలో యవ్వన మెరుపులు కచ్చితంగా కన్పిస్తాయి.

సూర్యకాంతితో పోటీపడేలా...

ఆంధ్రజ్యోతి(11-12-2020)

మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులతోనే కాదు ఇంట్లో దొరికే దినుసులతో కూడా చర్మాన్ని సౌందర్యవంతంగా మార్చు కోవచ్చు. దీనికి కావలసింది కాస్త సమయం, కాస్త ఓర్పు.


పాలు: చర్మసౌందర్యంలో పాల పాత్ర ఎంతో ఉంది.. మృతకణాలను తొలిగించడంలో పచ్చి పాలు చక్కగా పనిచేస్తాయి. ముఖాన్ని ఓసారి కడుక్కుని పచ్చి పాలని దూదితో పూయండి. అలాగే ఆరనిచ్చి కడిగేస్తే సరి. చర్మంలో యవ్వన మెరుపులు కచ్చితంగా కన్పిస్తాయి.  


తేనె: అందరి ఇళ్లలోనూ తేనె లభిస్తుంది. ఓ స్పూను తేనెను వేళ్ల మధ్యలోకి తీసుకుని ముఖంపై, చేతులు, కాళ్లపై వృత్తాకారంలో కాసేపు మర్డన చేయండి. ఓ పది నిమిషాలు ఆరనిచ్చి మెత్తని తడి గుడ్డతో తుడిచేయండి. చర్మంపై మెరుపును వెంటనే పసిగట్టవచ్చు.


నూనె: చలికాలంలోనే కాదు.. ఈ చిట్కాను అన్ని కాలాలలోనూ వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి. స్నానం చేసిన తరవాత లేదా ముఖం కడిగాక ఆల్మండ్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ లాంటి నూనె చుక్కలు తీసుకుని మర్దన చేయండి. చర్మం కాంతులీనుతుంది. కొబ్బరి నూనె కేవలం కురుల కోసమే కాదు ముఖారవిందానికీ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. ముఖానికి మాయిశ్చరైజర్‌లా కొబ్బరినూనెను వాడవచ్చు. కొబ్బరినూనె చుక్కల్ని ముఖానికి రాసి రుద్దితే పట్టులాంటి నునుపే కాదు మెరుపూ మీ సొంతం.


ఆలొవేరా: చర్మానికి కొత్త మెరుపులు తెస్తుంది ఆలొవేరా. కాస్త రసాన్ని ముఖం, మెడ మీద పూసుకుని ఓ పది నిమిషాలు ఆర నిచ్చి కడిగేయండి. చర్మ పోషణలో ఆవిరి పట్టడమూ ఓ భాగం. దీని వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. మలినాలు తొలగు తాయి. అంతే కాదు రోజుకోసారి ఆవిరి పట్టడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ప్రతి రాత్రీ చర్మం దానంతట అదే మరమ్మతు చేసుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ 7 నుంచి 8 గంటల నిద్ర ఎంతో అవసరం. 

Updated Date - 2020-12-11T15:46:43+05:30 IST