అందాన్ని పెంచే ఆహారం!

ABN , First Publish Date - 2020-11-18T19:33:00+05:30 IST

ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచుకోవచ్చు. ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల

అందాన్ని పెంచే ఆహారం!

ఆంధ్రజ్యోతి(18-11-2020)

ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని పెంచుకోవచ్చు. ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి తళుక్కుమనేలా చేస్తాయి. చలికాలంలోనూ మృదువైన చర్మం సొంతం కావాలంటే ఏమేం తినాలో చెబుతున్నారు చర్మనిపుణురాలు డాక్టర్‌ గీతికా మిట్టల్‌ గుప్తా. ఈ సీజన్‌లో చర్మసంరక్షణ కోసం ఆమె సూచిస్తున్న సలహాలివి...


అవకాడో: వీటిలో ఆరోగ్యకరమైన నూనెలు, విటమిన్‌ ఇ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ కణాలు సమర్థంగా పనిచేసేందుకు దోహదపడతాయి.


బాదం: ఇవి చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా చూస్తాయి. వీటిలో సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. 


గ్రీన్‌ టీ: యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ టీ ఫ్రీరాడికల్స్‌ను తొలగించి చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. అంతేకాదు ముడతలు, గీతలను మాయం చేస్తుంది.


క్యారెట్లు: వీటిలో విటమిన్‌ సి ఎక్కువగా దొరుకుతుంది. ఇది కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి ఉపయోగపడుతుంది. కొల్లాజెన్‌ ప్రొటీన్‌ చర్మాన్ని దృఢంగా, వదులుగా మారుస్తుంది.


పాలకూర: మెరిసే చర్మం కావాలనుకుంటే పాలకూర తప్పనిసరిగా ఆహారంలో ఉండాల్సిందే. దీనిలో విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. దీనిలోని ఐరన్‌ రక్తహీనతను నివారించి, పాలిపోయిన చర్మానికి రంగును ఇస్తుంది. 

Updated Date - 2020-11-18T19:33:00+05:30 IST