వ్యవసాయ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-28T19:26:07+05:30 IST

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండేళ్ల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు,

వ్యవసాయ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండేళ్ల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు, మూడేళ్ల అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సుకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.సుధీర్‌కుమార్‌ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు.


పాలిసెట్‌లో 89వ ర్యాంకు సాధించిన వి.శివానీకి మొదటి సీటు, 126వ ర్యాంకర్‌ లక్ష్మీ హర్షితకు రెండో సీటును కేటాయిస్తూ ప్రవేశపత్రాలు అందించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడేళ్ల వ్యవసాయ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులో శివానీ చేరగా, మధిర వ్యవసాయ పాలిటెక్నిక్‌లో లక్ష్మీహర్షిత ప్రవేశం పొందారు. నవంబరు 4 వరకు కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని రిజిస్ట్రార్‌ తెలిపారు.

Updated Date - 2020-10-28T19:26:07+05:30 IST