ఐడియాతోనే సక్సెస్‌

ABN , First Publish Date - 2020-10-08T18:35:45+05:30 IST

ఏడో తరగతి వరకు సొంతూళ్లోనే చదువుకున్నాను. ఎనిమిది నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ తరగతి నుంచే కాన్సెప్ట్‌ క్లారిటీపై దృష్టిపెట్టాను. ఫలితంగా ఇంటర్‌కు వచ్చేసరికే ఎలా చదువుకోవాలనే విషయమై స్పష్టత వచ్చింది.

ఐడియాతోనే సక్సెస్‌

స్వస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా

తండ్రి: ప్రభాకర రెడ్డి(స్టాక్‌ మార్కెట్‌ బిజినెస్‌)

తల్లి: వరలక్ష్మి (గృహిణి)

తమ్ముడు: ప్రణయ్‌ రెడ్డి (తొమ్మిదో తరగతి)

టెన్త్‌, ఇంటర్‌: 10/10

జెఇఇ మెయిన్‌: 99.99 (జనవరి), 99.97 (సెప్టెంబర్‌)

జెఇఇ అడ్వాన్స్‌డ్‌: 345 / 396 (రెండో ర్యాంక్‌)

హాబీలు: క్రికెట్‌, స్విమ్మింగ్‌, సినిమాలు

లక్ష్యం: సొంతంగా ఏదైనా


-గంగుల భువన్ రెడ్డి

జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో రెండో ర్యాంకర్


ఏడో తరగతి వరకు సొంతూళ్లోనే చదువుకున్నాను. ఎనిమిది నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ తరగతి నుంచే కాన్సెప్ట్‌ క్లారిటీపై దృష్టిపెట్టాను. ఫలితంగా ఇంటర్‌కు వచ్చేసరికే ఎలా చదువుకోవాలనే విషయమై స్పష్టత వచ్చింది. పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటాను. ఆపై కాన్సె్‌ప్ట(భావన) విషయంలో స్పష్టత సాధిస్తాను. అందులో క్లారిటీ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. స్ట్రెయిట్‌ పద్ధతిలో మొదట ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్‌ చేస్తాను. తదుపరి ప్రాక్టీ్‌సలో భాగంగా సదరు ప్రాబ్లెమ్‌ను వేగంగా, కచ్చితంగా చేసేలా చూసుకుంటాను. మొదట స్పష్టత తదుపరి ప్రాక్టీ్‌సను బట్టి మన ఆలోచనలూ పెరుగుతాయి. వేగానికి తోడు కాలిక్యులేషన్స్‌ విషయం కచ్చితత్వం సాధించాలి. అప్పుడే జెఇఇ అడ్వాన్స్‌డ్‌ వంటి పరీక్ష రాయగలుగుతాం. 


టెన్త్‌, ఇంటర్‌లో నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే మనకే వాటి తీరు అర్థమవుతుంది. ఇంటర్‌లో రెండు మార్కుల ప్రశ్నలతోనే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అదే పోటీ పరీక్షల విషయానికి వస్తే, ఎక్కువ భాగం ఈ రెండు మార్కుల ప్రశ్నల మాదిరిగానే ఉంటాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో కఠినత్వం మరింత అధికంగా ఉంటుంది. సిలబస్‌ పరిధిలోనే ప్రశ్నలు అడిగినప్పటికీ, స్పష్టంగా ఆలోచిస్తే తప్ప సాల్వ్‌ చేయలేని పరిస్థితి ఉంటుంది. పోటీ పరీక్షల్లో  ప్రశ్న చూడగానే ఐడియా రావడం ప్రధానం. ప్రాబ్లెమ్‌ చూడగానే అదెలా చేస్తే సొల్యూషన్‌ సులువుగా లభిస్తుందన్న విషయమై మెరుపు మాదిరిగా ఆలోచన కలగాలి. 


సబ్జెక్టుల వారీగా

లెక్కల్లో టీచర్‌ సాధారణంగా మెయిన్‌ మోడల్స్‌ అన్నీ బోధిస్తారు. అవన్నీ అర్థం చేసుకున్న తరవాత రిలేటెడ్‌ ప్రాబ్లెమ్స్‌ను చేయాలి. బేసిక్‌ ఫార్ములాలను మైండ్‌లో అదీ క్రిస్టల్‌ క్లియర్‌గా ఫిక్స్‌ చేసుకోవాలి. ఫిజిక్స్‌ నాకు ఇష్టమైన సబ్జెక్టు. ఇందులోనూ కాన్సెప్ట్‌ తెలుసుకోవడమే కాదు, ప్రాబ్లెమ్‌కు అన్వయించాలంటే ఆలోచన చాలా ముఖ్యం. హెచ్‌సి వర్మ పుస్తకం దీనికి బాగా ఉపయోగపడుతుంది. బేసిక్స్‌ తెలుసుకోవచ్చు. జనరల్‌ ఐడియా కూడా వస్తుంది. ఐడియాను ప్రాబ్లమ్‌కు అప్లయి చేయా ల్సి ఉంటుంది. కెమిస్ట్రీకి ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను క్షుణ్ణం గా చదువుకుంటే సిలబస్‌ చాలావరకు  కవర్‌ అవుతుం ది. ఫిజికల్‌ కెమిస్ట్రీలో కొద్దిపాటి థియరీ ఉంటుంది. అది బాగా చదువుకోవాలి. ఇందులో థియరీ లేదంటే ప్రాబ్లెమ్‌ ఏదైనా సిలబస్‌ పరిధిలోనే ఉంటుంది. అదే ఈ సబ్జెక్టులో ఉన్న వెసులుబాటు.  


నాన్నతో మాట్లాడితే చాలు

ఒత్తిడికి గురైనప్పుడు నాన్నగారితో మాట్లాడితే చాలు, చాలా వరకు బైటపడతాను. స్నేహితులతో కొద్దిసేపు గడిపినా ఒత్తిడి నుంచి రిలీఫ్‌ పొందగలను. జనవరి విడత జెఇఇ మెయిన్‌ రాసినప్పుడు  కొన్ని మెమరీ ప్రశ్నల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అప్పుడు స్ట్రెస్‌ అనిపించింది. అది తప్ప పెద్దగా స్ట్రెస్‌కు గురైన సందర్భాలు లేవనే చెప్పాలి. నాన్నగారికి పుస్తకాలు చదవడం హాబీ. నన్నూ చదవమంటారు. పలు పుస్తకాలు సూచించారు కూడా. ఇప్పుడిక వాటిపై కూడా దృష్టి పెట్టాలి.  బాంబే ఐఐటిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో చేరుతాను. సొంతంగా ఏదైనా  ఆరంభించాలన్నది నా ఆలోచన.


పిల్లల్ని స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి

జేమ్స్‌ అలెన్‌ పుస్తకానికి తెలుగు అనువాదం ‘మనిషంటే అతని ఆలోచనలే’ హైస్కూల్‌ స్థాయిలోనే చదవదగ్గ పుస్తకం. ఆలోచనల్లో స్పష్టతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నా చిన్నతనంలో ఇది ఎందుకు చదవలేకపోయనా అని అనిపిస్తూ ఉంటుంది. అకడమిక్‌గా నాకు పెద్ద అర్హతలు లేవు. అయినప్పటికీ పుస్తకాలు చదవడం నాకు వ్యాపకం. సొంతంగా నాకు లైబ్రరీ ఉంది. అన్ని రకాల పుస్తకాలు చదువుతుంటాను. రోజుకు కనీసం రెండు గంటలైనా పుస్తకాలు చదవందే నాకు తోచదు. ఎలాంటి డైవర్షన్‌ పెట్టుకోకుండా అనుకున్న ఆలోచన దిశగా ముందడుగు వేయండని మాత్రమే నా పిల్లలు ఇద్దరికీ చెబుతుంటాను. ఆలోచనలను అదుపు చేసుకోగలిగితే ఎంతటి ఘనకార్యాన్ని అయినా సులువుగా సాధించవచ్చని నమ్ముతాను, అదే నా పిల్లలకు చెబుతుంటాను.


- ప్రభాకర రెడ్డి(తండ్రి)

Updated Date - 2020-10-08T18:35:45+05:30 IST