నాటక నివాళి

ABN , First Publish Date - 2020-09-05T06:25:01+05:30 IST

ఇటీవల మరణించిన సీనియర్‌ పాత్రికేయుడు, సాంస్కృతిక విశ్లేషకుడు, నాటకాభిమాని, ప్రోత్సాహకులు జి.ఎల్‌.ఎన్‌. మూర్తి స్మృత్యర్థం ఢిల్లీకి చెందిన ప్రయోగం థియేటర్‌ గ్రూపు అరుదైన నాటక నివాళి కార్యక్రమాన్ని రూపొందించింది.

నాటక నివాళి

ఇటీవల మరణించిన సీనియర్‌ పాత్రికేయుడు, సాంస్కృతిక విశ్లేషకుడు, నాటకాభిమాని, ప్రోత్సాహకులు జి.ఎల్‌.ఎన్‌. మూర్తి స్మృత్యర్థం ఢిల్లీకి చెందిన ప్రయోగం థియేటర్‌ గ్రూపు అరుదైన నాటక నివాళి కార్యక్రమాన్ని రూపొందించింది. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగం సహకారంతో నేటి నుంచి పదహారో తేదీ వరకు వివిధ భారతీయ భాషలలోని ప్రముఖ నాటకాలను నాటకాభిమానులు ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించవచ్చు. నేడు స్వానంద్‌ కిర్‌కిరె దర్శకత్వంలో ‘ఆవో సాథీ సప్న దేకన్‌’, 6వ తేదీ రాజీవ్‌ వెల్చేటి దర్శకత్వంలో ‘యవ నవ్వనం’, 7వ తేదీ సందీప్‌ యాదవ్‌ దర్శకత్వం వహించిన ‘బటర్‌ ఫ్లై’, 8వ తేదీ మల్లికా ప్రసాద్‌ దర్శకత్వంలో ‘హిడెన్‌ ఇన్‌ ప్లెయిన్‌ సైట్‌’, 9వ తేదీ మహేశ్‌ గోడేశ్వర్‌ దర్శకత్వంలో ‘హీరో ఆలోం’, 10వ తేదీ వెంకట నరేష్‌ బూర్ల దర్శకత్వంలో ‘రాజుగోరు’ ప్రదర్శనలుంటాయి. 11వ తేదీ రాజేంద్ర పంచవ్‌ దర్శకత్వంలో ‘కథ సుకవి సూర్యమల్‌కి’, 12వ తేదీ తూము శివప్రసాద్‌ దర్శకత్వంలో ‘బారిష్టర్‌ పార్వతీశం’, 13వ తేదీ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో ‘సోర్‌దిద్‌’, 14వ తేదీ ఇండ్ల చంద్రశేఖర్‌ దర్శకత్వంలో ‘మిస్‌ మీనా’, 15వ తేదీ రత్నశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘లాస్ట్‌ విష్‌ బేబి’, 16వ తేదీ నౌషద్‌ కుంజు దర్శకత్వంలో ‘ట్రోజన్‌ ఉమెన్‌’ నాటకాలుంటాయి. www.prayogam.in/fest లింక్‌ ద్వారా ప్రతి నాటకాన్ని 24 గంటల వ్యవధిలో ఎప్పుడైనా చూడవచ్చని, నివాళి కార్యక్రమ డైరెక్టర్‌, ప్రముఖ దర్శకుడు తూము శివప్రసాద్‌ తెలిపారు. 


బి.వి. అప్పారావు, విశాఖపట్నం

Read more