కన్నబిరాన్ స్మారకోపన్యాసాలు

ABN , First Publish Date - 2020-11-08T05:52:35+05:30 IST

ప్రముఖ న్యాయవాది, ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కె.జి.కన్నబిరాన్...

కన్నబిరాన్ స్మారకోపన్యాసాలు

ప్రముఖ న్యాయవాది, ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కె.జి.కన్నబిరాన్ (1929–-2010) చనిపోయి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ‘ది కె.జి. కన్నబిరాన్ లెక్చర్స్ ఆన్ లా, జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్’ నిర్వహించనున్నారు. కన్నబిరాన్‌కు జీవితంలోను, వృత్తిలోను, ప్రజాహితరంగాలలోను పరిచితులు, సన్నిహితులు అయిన న్యాయశాస్త్ర కోవిదులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ స్మారకోపన్యాసాలను వెలువరించనున్నారు.


రేపు(9వ తేదీన) మొదటి కన్నబిరాన్ స్మారకోపన్యాసాన్ని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ‘డెత్ ఆఫ్ డెమోక్రాటిక్ ఇన్‌స్టిట్యూషన్స్: ది ఇన్‌ఎవిటబుల్ లాజిక్ ఆఫ్ నియో- లిబరల్ పొలిటకల్ ఎకానమీ అండ్ ఎబాండన్‌మెంట్‌ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ’ అన్న అంశంపై వెలువరించనున్నారు. ఇంకా జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ కె.చంద్రు, ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షి, జస్టిస్ జడ్ ఎమ్ యాకూబ్ (దక్షిణాఫ్రికా), అడ్వకేట్ బి. నళిన్ కుమార్, అడ్వకేట్ మిహార్ దేశాయి, అడ్వకేట్ నిత్యా రామకృష్ణన్, అడ్వకేట్ బి బి మోహన్, అడ్వకేట్ వి.రఘు, డాక్టర్ ఉషా రామనాథన్, అడ్వకేట్ కొలిన్ గొన్సాల్వెజ్, అడ్వకేట్ వృందా గ్రోవర్, అడ్వకేట్ హెన్రీ టిప్‌హాగ్నేలు వరసగా ఈ స్మారకోపన్యాసాలు వెలువరిస్తారు. వీటిని 

https://youtube.com/embed/s_G2DFvX1A0 లింక్ ద్వారా వినవచ్చు.

Read more