సెల్ఫీ తీసుకుబోయి నదిలో మునిగిన టూరిస్ట్

ABN , First Publish Date - 2020-12-19T11:38:24+05:30 IST

సెల్ఫీ తీసుకుబోయి బియాస్ నదిలో మునిగి మరణించిన పర్యాటకుడి విషాద గాథ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీలో...

సెల్ఫీ తీసుకుబోయి నదిలో మునిగిన టూరిస్ట్

మండీ (హిమాచల్ ప్రదేశ్): సెల్ఫీ తీసుకుబోయి బియాస్ నదిలో మునిగి మరణించిన పర్యాటకుడి విషాద గాథ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాకు చెందిన చాంద్ మహ్మద్ మండీ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. పర్యాటకుల బృందం మనాలీకి వెళుతూ బనాలా వద్ద  బియాస్ నది వద్ద ఆగారు. మహ్మద్ బియాస్ నది వద్ద  సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులోపడి మునిగి మరణించాడు. నదిలో మునిగి కొట్టుకుపోయిన మహ్మద్ మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రత్యేక గజఈతగాళ్లను రంగంలోకి దించారు. బియాస్ నదిలో ఒకరు మరణించడంతో విహారయాత్ర కాస్తా విషాద యాత్రగా మారింది. 

Read more