నిఫ్టీ @13,000

ABN , First Publish Date - 2020-11-25T06:50:24+05:30 IST

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ-50 చరిత్రలో తొలిసారిగా 13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది.మంగళవారం ఎన్‌ఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి నిఫ్టీ 128.70 పాయింట్ల పెరుగుదలతో...

నిఫ్టీ @13,000

  • 129 పాయింట్లు పెరిగిన సూచీ 
  • 44,500 ఎగువకు సెన్సెక్స్‌ 

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ-50 చరిత్రలో తొలిసారిగా 13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది.మంగళవారం ఎన్‌ఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి నిఫ్టీ 128.70 పాయింట్ల పెరుగుదలతో 13,055.15 వద్ద ముగిసింది. మరోవైపు 44,601.63 వద్ద సరికొత్త జీవిత కాల ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. చివరికి 445.87 పాయింట్ల లాభంతో 44,523.02 వద్ద ముగిసింది. కరోనా వ్యాక్సిన్‌ పరీక్షల్లో పురోగతి, విదేశీ సంస్థాగత పెట్టుబడులు, రూపాయి మరింత బలపడటం వంటి అంశాలు ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపర్చాయి. కరోనా సంక్షోభ ప్రభావంతో కుదేలైన స్టాక్‌ సూచీలు మార్చి లో కనిష్ఠ స్థాయిలను చవిచూశాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకొని సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. గడిచిన 8 నెలల్లో నిఫ్టీ 73 శాతం వృద్ధి చెందింది. అంతేకాదు, కేవలం 14 ట్రేడింగ్‌ సెషన్ల (ఈ నెల 5 నుంచి 24)లో నిఫ్టీ 12,000 నుంచి 13,000 మైలురాయికి చేరుకుంది. ఈ పద్నాలుగు సెషన్లలో సూచీ 8 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. 




3 వారాల గరిష్ఠానికి రూపాయి : దేశీయ కరెన్సీ విలువ మూడు వారాల గరిష్ఠ స్థాయికి పెరిగింది. అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 10 పైసలు బలపడి 74.10 వద్ద స్థిరపడింది. కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుందన్న అంచనాలతోపాటు ఈక్విటీ మార్కెట్లోకి ఎఫ్‌ఐఐల ప్రవాహం రూపాయికి దన్నుగా నిలిచాయి. 

Updated Date - 2020-11-25T06:50:24+05:30 IST